ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడి 108 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4,70,462 ఒమిన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యూకేలో అత్యధికంగా 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, డెన్మార్క్ 57,125, USA 42,539, జర్మనీలో 35,529 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించింది. కాగా దేశంలో ప్రస్తుతం 2,135 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
Read More »TimeLine Layout
January, 2022
-
6 January
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,531 టెస్టులు చేయగా 1,520 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్నటితో (1,052) పోలిస్తే ఏకంగా 500 కేసులు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులుండగా, కరోనాతో ఒకరు మరణించారు. అయితే ఇవాళ ఒమిక్రాన్ కేసులేవీ రాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ …
Read More » -
6 January
మహారాష్ట్రలో ఒమిక్రాన్ భయోత్పాతం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ భయోత్పాతం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 144 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒక్క ముంబైలోనే 100 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 96.55శాతానికి తగ్గింది.
Read More » -
6 January
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం
దేశంలో రోజు రోజుకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదయింది. రాజస్థాన్లో ఒమిక్రాన్ సోకిన 72ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బాధితుడు ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు రాగా.. అది ఒమిక్రాన్ మరణం కాదని తేలింది.
Read More » -
6 January
మీనా కుటుంబంలో కరోనా కలవరం
ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతూగిలించిన మోస్ట్ బ్యూటీఫుల్ లేడీ..అలనాటి హీరోయిన్ మీనా ఇంట్లో కరోనా ఆందోళన నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మీనా స్వయంగా వెల్లడించింది. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటికి అతిథిగా కరోనా వచ్చింది. దానికి మా కుటుంబం బాగా నచ్చింది. అయితే.. దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా కేర్ఫుల్గా ఉండండి. కరోనా జాగ్రత్తలు పాటించండి’ …
Read More » -
6 January
రవితేజ సరసన దక్ష నగార్కర్
కరోనా పీక్ టైంలో విడుదలై ఘన విజయం సాధించిన క్రాక్ మూవీ తర్వాత వరుస సినిమాలతో స్టార్ సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం.. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీ ఈ నెల 14న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ దక్ష నగార్కర్ ను …
Read More » -
6 January
ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపుపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
బంగార్రాజు ప్రమోషన్ మీట్లో సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తొలిసారి స్పందించాడు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తమ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించాడు. రేట్లు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. తమ సినిమా వసూళ్లు కొంచెం తగ్గినా పరవాలేదన్నాడు. రేట్లు పెంచలేదని ‘బంగార్రాజు’ను జేబులో పెట్టుకుని కూర్చోలేం కదా అని తెలిపాడు. …
Read More » -
5 January
బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే …
Read More » -
5 January
నాలుగో టెస్టు తొలిరోజు వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 126 పరుగులు
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా కేవలం 46.5 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. దీంతో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. వార్నర్ 30, హారిస్ 38, లబుషేన్ 28 రన్స్ చేసి ఔట్ కాగా.. స్మిత్ 6నాటౌట్, ఖవాజా 4నాటౌట్తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్, వుడ్ తలో వికెట్ తీశారు.
Read More » -
5 January
బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం
బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు రేణూ దేవీ, తారా ప్రసాద్ సహా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరిలకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పంజాబ్లోను కరోనా విలయతాండవం చేస్తోంది. శిరోమణి ఆకాలిదళ్ అధ్యక్షుడు సుఖేవ్ సింగ్ ధిండా కరోనా బారిన పడ్డారు.
Read More »