ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ మహిళతో పాటు ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులకు ఒమిక్రాన్ వచ్చింది. USA నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
Read More »TimeLine Layout
January, 2022
-
5 January
అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేగుతోంది. ముంబైలోని అమితాబ్ నివాసంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిగ్ బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలై 11న అమితాబ్ కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఇంట్లో మరోసారి …
Read More » -
5 January
గంగూలీ ఫ్యామిలీకి కరోనా
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన కుటుంబంలో నలుగురికి పాజిటివ్ గా తేలింది. వీరిలో అతని కూతురు కూడా ఉంది. అయితే వీరందరికీ తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల అందరినీ హోం ఐసోలేషన్ లోనే ఉంచారు. గంగూలీ భార్య మాత్రం నెగటివ్ వచ్చింది. ఇప్పటికే గంగూలీకి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Read More » -
5 January
ఢిల్లీలో 10వేల కరోనా కొత్త కేసులు
దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం 8.3గా ఉన్న పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. దేశం మూడో వేవ్లోకి ప్రవేశించిందన్న ఆయన.. ఢిల్లీకి మాత్రం అది ఐదో వేవ్ అని వెల్లడించారు. ఇక ప్రైవేటు 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసినట్లు …
Read More » -
5 January
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9 నుంచి వచ్చే అన్ని ఆదివారాలు తమిళనాడులో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాలేజీలు పూర్తిగా మూసివేయాలని.. థియేటర్లు 50శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ప్రభుత్వం సూచించింది. మరిన్ని ఆంక్షలు విధించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
Read More » -
5 January
దేశంలో కొత్తగా 2135 ఒమిక్రాన్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరిగిపోతూ భయపెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కి చేరింది. మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71, ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్రప్రదేశ్ 24, బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 9, ఉత్తరాఖండ్ 8, గోవా 5 కేసులు నమోదయ్యాయి. మరోవైపు …
Read More » -
5 January
తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022 ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఇక 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉండగా.. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగింది.
Read More » -
5 January
నడ్డా నక్రాలు ఆపు… ఈడ నిన్ను నమ్మే బక్రాలు ఎవ్వరూ లేరు’
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామని, మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని నడ్డాకు సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని …
Read More » -
5 January
Amazon Primeలోకి పుష్ప- Date Fix
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యూత్ ఐకాన్..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మీకా మంధాన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసు రికార్డ్లను తిరగరాస్తుంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ …
Read More » -
4 January
కుప్పకూలిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46), మయాంక్ (26), విహారి (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, ఒలీవియర్, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. చివర్లో అశ్విన్ పోరాటంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.
Read More »