TimeLine Layout

December, 2021

  • 30 December

    శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు

    శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు ఈ మద్యం తాగడం మానేయాలి ఈ నీరు ఎక్కువగా తాగాలి ఈ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇ చక్కెర, కెఫిన్ పదార్థాలను తినడం తగ్గించాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. డార్క్ చాక్లెట్లను తినాలి * గ్రీన్ టీ తాగాలి * పుచ్చకాయ, దానిమ్మ ఎక్కువగా తీసుకోవాలి

    Read More »
  • 30 December

    అధిక ఉప్పు తింటున్నారా..?

    అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తామట. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇక వేసవిలో సాల్ట్ను దాదాపు పూర్తిగా తగ్గించడం బెటర్. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

    Read More »
  • 30 December

    బొప్పాయితో ప్రయోజనాలు ఎన్నో..?

    ఒత్తిడి జీవితం, మారిన జీవనశైలి, హార్మోన్లలో మార్పులు, ఆహార అలవాట్ల వల్ల మహిళల్లో పీరియడ్స్ సమయానికి రావు. అయితే బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది సహజంగా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరలో ఉండే అపియోల్, మిరిస్టిసిన్ గర్భాశయం సంకోచించేలా చేసి నెలసరికి దోహదపడుతుంది. వీటితోపాటు అల్లం-లవంగం వాము తీసుకుంటే మంచిది.

    Read More »
  • 30 December

    నిమ్మరసం తాగడం వల్ల లాభాలెన్నో..?

    నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ క్యాలరీలను బర్న్ చేస్తూ.. కొవ్వును నిల్వ ఉండకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా లెమన్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే నిల్వ చేసిన నిమ్మరసం తాగకూడదు.

    Read More »
  • 30 December

    అంతర్జాతీయ క్రికెట్ కి రాస్ టేలర్ గుడ్ బై

    న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్తో త్వరలో జరగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్తో ఆరు వన్డేల అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. గత 17 ఏళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పి టేలర్.. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ట్వీట్ చేశాడు.

    Read More »
  • 30 December

    నోటి దుర్వాసనకు చెక్ పెట్టండిలా!

    నోటి దుర్వాసనకు చెక్ పెట్టండిలా! మీ దంతాలను క్రమం తప్పకుండా కనీసం 3 నిమిషాలు బ్రష్ చేయండి ‘సున్నితంగా, ఒత్తిడి పడకుండా నోట్లో రౌండ్ కదిలిస్తూ బ్రష్ చేయాలి ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మీ బ్రషు మార్చండి భోజనం చేసిన తర్వాత నీరు పుక్కిలించి ఉమ్మండి బాక్టీరియాను తొలగించడానికి నాణ్యత ఉండే టంగ్ క్లీనర్ వాడండి

    Read More »
  • 30 December

    ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.

    Read More »
  • 30 December

    మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

    తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో 2004లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. జహీరాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2016లో ఎమ్మెల్సీ  గా ఎన్నికయ్యారు.

    Read More »
  • 30 December

    నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ -CM KCR

    తెలంగాణలోని నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31న రూ.110 కోట్లతో చేపట్టే ఐటీ హబు శంకుస్థాపన చేస్తామన్న సీఎం కేసీఆర్ నగరంలో 2 ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రూ.36 కోట్లతో కొత్త డిగ్రీ కాలేజీ భవనం నిర్మించాలన్న సీఎం.. పట్టణాన్ని సుందరంగా మార్చాలన్నారు. కాగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ నిన్న బుధవారం  …

    Read More »
  • 30 December

    అమూల్ సంస్థ రావడం గర్వకారణం -మంత్రి KTR

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బేకరీ తయారీ ప్లాంటును అమూల్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణానికి మొదటి దశలో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat