డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్ను తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోట్టీ అన్నారు. తాను ఇప్పటివరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశానని, సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. కాగా, కోట్టీ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించి ఆ దేశ వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.
Read More »TimeLine Layout
December, 2021
-
21 December
గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో రాత్రి పూట నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని గుజరాత్ సర్కారు పేర్కొంది. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా గుజరాత్లో తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య …
Read More » -
21 December
తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 207 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా నిన్న, ఇవాళ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
Read More » -
21 December
నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కారు సిద్ధమైంది. అన్ని శాఖల్లో కలిపి 86 వేల ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోనూ ఏర్పడిన 55వేలకు పైగా ఉద్యోగాలను వరుస నోటిఫికేషన్లలో భర్తీ చేయాలనుకుంటోంది. ఇక నుంచి ఖాళీలు ఏర్పడ్డ 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసేలా ప్లాన్ చేస్తోంది.కాగా హోంశాఖలో 21507, విద్యాశాఖలో 22వేలు, వైద్యశాఖలో 10,048, …
Read More » -
21 December
జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీలుగా జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు, బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలున్నాయి.
Read More » -
21 December
నాదల్ కు కరోనా
స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.
Read More » -
21 December
ఢిల్లీ రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకం పెంపు
ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Read More » -
21 December
విద్యాభ్యాసమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అమ్మాయిలకు తొలిమెట్టు
అమ్మాయిల విద్యాభ్యాసం సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మొదటిమెట్టు అని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు జి. లక్ష్మణ్ కుమార్ అన్నారు. `ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ ` కార్యక్రమం ద్వారా భారత దేశ విశిష్టతలు ప్రజలందరూ విపులంగా తెలుసుకుంటున్నారని ఆయన వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్ర ప్రచార విభాగం వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని పింగిలి మహిళా …
Read More » -
21 December
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …
Read More » -
21 December
పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీకి చెందిన నేత, మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ రాజకీయ అజ్ఞాని అని నాని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని.. అధికార వైసీపీకి చెందిన ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీకి జనసేన అధినేత పవన్ సలహాలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. వెళ్లి బీజేపీకి సలహాలు ఇచ్చుకోవాలని …
Read More »