TimeLine Layout

July, 2021

  • 10 July

    నారాయ‌ణ‌పేట‌లో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆర్

    నారాయ‌ణ‌పేట జిల్లా కేంద్రంలో రాష్ర్ట ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. నారాయ‌ణ‌పేట జిల్లా ఆస్ప‌త్రిలో చిన్న‌పిల్ల‌ల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. స‌మీకృత మార్కెట్‌కు, అమ‌ర‌వీరుల స్మార‌క పార్కుకు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి, క‌లెక్ట‌ర్ హరిచంద‌న‌తో పాటు ప‌లువురు నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

    Read More »
  • 10 July

    ప‌ట్ట‌ణాల్లో ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి-ఎమ్మెల్యే శంకర్ నాయక్

    తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌హ‌బూబాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ నాయ‌క్ ప‌ర్య‌టించారు. ప‌ట్ట‌ణంలోని 35వ వార్డులో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్.. చెత్త‌ను తొల‌గించి, మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ మాట్లాడుతూ.. ప‌ట్ట‌ణాల్లో ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. అన్ని వార్డుల్లో శానిటేష‌న్ ప‌నులు చేప‌ట్టాల‌ని, మురుగు నీరు నిల్వ లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. భ‌విష్య‌త్ …

    Read More »
  • 10 July

    దేశంలో కరోనా డేంజర్ బెల్స్

    దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 42,766 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1206 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో న‌మోదు అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్న‌ది.

    Read More »
  • 10 July

    వారెవ్వా.. ఏమి క్యాచ్.!. మీరు వీడియో చూస్తే షేర్ చేస్తారు..?

    భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. శుక్రవారం నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైనా.. భారత యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందుకున్న ఓ అద్భుత క్యాచ్‌ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది. మహిళల క్రికెట్‌లోనే అది కనీవినీ ఎరగని క్యాచ్‌ …

    Read More »
  • 10 July

    ఎమ్మెల్యే వివేకానంద్ ను కలిసిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అంగడిపేట్ పేట్ బషీరాబాద్ కు చెందిన సోషల్ వెల్ఫేర్అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుమ్మరి సురేష్, వైస్ ప్రెసిడెంట్ కుమ్మరి శ్రీకాంత్, జెనరల్ సెక్రెటరీ కుమ్మరి ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ వేముల క్రిస్టోఫర్, ట్రెజరర్ …

    Read More »
  • 10 July

    నాటిన ప్రతి మొక్కను సంరక్షించడమే లక్ష్యం…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 10, 12, 13వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రజలు తప్పక మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. …

    Read More »
  • 10 July

    IITA లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది.శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు గారు, …

    Read More »
  • 10 July

    సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

    ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించింది. శుక్ర‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో దేవ‌స్థాన ట్ర‌స్టీ ఫౌండ‌ర్ కె.సాయిబాబ గౌడ్, ఈవో అన్నపూర్ణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వానించారు. సీఎంకు ఆహ్వానం ప‌లికిన వారిలో ఆలయ అర్చకులు, ట్రస్టుబోర్డు సభ్యులు తదితరులున్నారు. 12వ …

    Read More »
  • 10 July

    రైతుగా మారిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

    వరి వేదజల్లే సాగు పద్దతితో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రైతు రాయగారి శ్రీనివాస్ చెందిన వరి వెదజల్లే సాగును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుగా మారి పోలంలో వరి వేదజల్లే విత్తనాలు పోశారు. పోలం చూట్టు కలియతిరిగి మొలక వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన …

    Read More »
  • 9 July

    నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త

    తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat