TimeLine Layout

June, 2021

  • 1 June

    అంద‌రికీ తొలి డోసు వ్యాక్సిన్‌కు ఎంత కాలం ప‌డుతుందో తెలుసా

    ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ క‌రోనా వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌దే ప‌దే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ప‌రిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పూర్తి వ్యాక్సినేష‌న్ కాదు క‌దా.. కేంద్రం చెప్పిన స‌మ‌యానికి అంద‌రికీ క‌నీసం తొలి డోసు వ్యాక్సిన్ ఇవ్వ‌డం కూడా కుద‌ర‌ద‌ని తాజాగా ఓ అధ్య‌య‌నం తేల్చింది. దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లు 94.4 …

    Read More »
  • 1 June

    తీవ్ర అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం

    ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.

    Read More »

May, 2021

  • 31 May

    Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం

    ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …

    Read More »
  • 31 May

    వివాదంలో మీరా చోప్రా

    నటి మీరా చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. థానేలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్గా చెప్పుకుని తప్పుడు పత్రాలు చూపి వ్యాక్సిన్ తీసుకుందని BJP నేత ఒకరు ఇందుకు సంబంధించిన ఆధారాలు పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ‘బంగారం, వాన, మారో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఎన్నో హిందీ, తమిళ …

    Read More »
  • 31 May

    డీ గ్లామర్ పాత్రలో కాజల్

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ క్వీన్ కాజల్ తొలిసారి ఓ డీ గ్లామర్ రోల్లో నటించనుంది. కొత్త దర్శకుడు జయశంకర్ తెరకెక్కించే ఓ మహిళా నేపథ్య సామాజిక కథాంశంలో కాజల్ నటించనుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కన్పించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    Read More »
  • 31 May

    తెలంగాణలో కొత్తగా 1,801 పాజిటివ్ కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,801 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. కరోనా నుంచి 5,32,557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,263 మంది మృతి చెందారు.

    Read More »
  • 31 May

    విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్

    ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

    Read More »
  • 31 May

    కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

    ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.

    Read More »
  • 31 May

    ఇలియానా సంచలన వ్యాఖ్యలు

    హీరోయిన్ ఇలియానా సినీ రంగంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఇక్కడ ఏ మాత్రం లభించదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. కొన్నింటిని చూస్తూనే ఉండాలి. ధనార్జనే అంతిమలక్ష్యంగా పరిశ్రమ పనిచేస్తుంది’ అని ఇలియానా చెప్పింది.

    Read More »
  • 31 May

    ఖర్జూరం తింటే

    ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.  ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat