TimeLine Layout

May, 2021

  • 6 May

    KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన

    అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

    Read More »
  • 6 May

    టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా

    ఏపీలో సంచలనం సృష్టించిన సంగం డెయిరీలో అక్రమాలకు సంబంధించి అరెస్టైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ తేలింది. ఇటీవల జ్వరం, జలుబు లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని హైకోర్టు ఏసీబీ అధికారులను ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించనున్నారు.

    Read More »
  • 6 May

    విజయ్ దేవరకొండ సరసన కత్రినా కైఫ్

    టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సరసన నటించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లైగర్ పూర్తైన తర్వాత తన సినిమా ప్రకటించాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహర్ భావించాడట. అయితే, ఈ సినిమా గురించి సమాచారం ముందుగానే బయటకి వచ్చేసింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే కత్రినాతో విజయ్ రొమాన్స్ చేయడం ఖాయమంటున్నాయి బీటౌన్ వర్గాలు.

    Read More »
  • 6 May

    తప్పుడు కథనమని ఒప్పుకున్న ఆదాబ్ హైదరాబాద్

    ఆగం అయిన ఆదాబ్ హైదరాబాద్..తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిపై ఇటివల ”జీఓయంఎస్ 67 ను ఉల్లంఘించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ” అంటూ వచ్చిన కథనం తో పొరపాటు దొర్లినట్టు అదాబ్ హైదరాబాద్ పేపర్ యాజమాన్యం దృవీకరించింది. . వారి పేపర్ స్థానిక విలేకరి ఎమ్మెల్యే గారిని కుటుంబ సభ్యులను డబ్బులు అడగగా వారు ఇవ్వకపోవడంతో వారిని …

    Read More »
  • 6 May

    ఈటలది అధికార దుర్వినియోగం -ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు

    మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌ గెస్ట్‌హౌస్‌లో లక్ష్మీకాంతారావు మీడియాతో మాట్లాడారు. పదవులు అడ్డుపెట్టుకొని ఈటల అధికార దుర్వినియోగం చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూములను కొనడమే కాకుండా.. ప్రభుత్వం కొనడం లేదా? అని ప్రశ్నించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. 66 ఎకరాల అసైన్డ్‌ భూమిని …

    Read More »
  • 6 May

    GHMCలో కరోనా కట్టడీపై ఇంటింటి సర్వే

    తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి స‌ర్వే బుధ‌వారం కూడా కొన‌సాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది న‌మోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్ల‌ను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …

    Read More »
  • 6 May

    తెలంగాణలో 6,026 కరోనా కేసులు

    తెలంగాణలో మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 పాజిటివ్‌ కేసులు రికార్డవగా.. 52 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా వైరస్‌ నుంచి 6,551 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, …

    Read More »
  • 6 May

    ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల‌కు డ‌బ్బులు

    తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌పై సిద్దిపేట క‌లెక్ట‌రేట్ నుంచి మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముజ‌మ్మీల్ ఖాన్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంత‌రం రైతుల‌కు డ‌బ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచార‌ని తెలిపారు. ధాన్యం …

    Read More »
  • 6 May

    తెలంగాణలో నియంత్రణలోనే కరోనా

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం & హెచ్.ఓ.ల తో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు …

    Read More »
  • 6 May

    అజిత్ సింగ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

    కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat