మీకు ఈ అలవాట్లు ఉన్నాయా… అయితే ఇప్పుడే మానుకొండి.. 1. తక్కువ నిద్ర: రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నిద్ర తక్కువైతే జీవితకాలం తగ్గుతుంది. 2. ధూమపానం వద్దు: పొగ తాగితే వయసు పదేళ్లు క్షీణిస్తుంది 4. హెడ్ ఫోన్స్ తో పెద్ద శబ్దంతో వినొద్దు: వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి. 5. తీపి పదార్థాలు ఎక్కువగా తినవద్దు 6. ఫాస్ట్ఫుడు దూరంగా ఉండండి 7. ఎక్కువ …
Read More »TimeLine Layout
April, 2021
-
21 April
రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More » -
21 April
ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం
లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
Read More » -
21 April
లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More » -
21 April
రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూత
భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
Read More » -
21 April
కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం
కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు
Read More » -
21 April
దేశ ప్రజలకు కోహ్లీ పిలుపు
దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …
Read More » -
21 April
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏటా వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. భద్రాచలంలో రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు టీవీల ద్వారా వీక్షించాలని కోరారు.
Read More » -
20 April
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కళ్యాణమహోత్సవాన్ని ఆన్ లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సిఎం కోరారు. లోక …
Read More » -
20 April
రాహుల్ గాంధీకి కరోనా
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
Read More »