తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది
Read More »TimeLine Layout
March, 2021
-
19 March
రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా రవితేజ
మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజ్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపజేయాలనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్నాడు
Read More » -
19 March
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 47 కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
Read More » -
19 March
హైదరాబాద్‌లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..
మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ …
Read More » -
19 March
చర్మ సౌందర్యానికి చిట్కాలు
ఉదయాన్నే కొంచెం తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీటిని తీసుకోండి కళ్లపై ఐస్ క్యూబ్స్ తో తరచూ మర్ధనా చేయండి రోజూ కొద్ది సమయం పాటు వ్యాయామం చేయండి శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి డ్రై స్కిన్ ఉంటే గోరు వెచ్చటి కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని నిద్రపోండి. ఉదయాన్నే కడిగేయండి సహజసిద్ధ పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోండి నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి.
Read More » -
19 March
తొలిసారిగా మిల్క్ బ్యూటీ తమన్నా..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… మిల్కీ బ్యూటీ తమన్నా ‘సీటీమార్’లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. తెలంగాణ యాసలో ఈ అమ్మడు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం సరదాగా ఉంది. డబ్బింగ్ లో దర్శకుడు సంపత్ నంది నాకు సహాయం చేశారు’ అని పోస్ట్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో …
Read More » -
19 March
తెలంగాణలో కొత్తగా 313 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 142 మంది బయటపడగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకోగా, 2,98,262 మంది కోలుకున్నారు. ఇప్పటిరకు మహమ్మారివల్ల 1664 మంది మృతిచెందారు. మరో 2434 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 …
Read More » -
19 March
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రకటన
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్ ఇక వన్డేల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వన్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. షమి, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి కోలుకుంటుండటంతో వాళ్ల పేర్లను పరిశీలించలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో …
Read More » -
19 March
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …
Read More » -
19 March
అందాలు ఆరబోస్తూ ఇరగదీసిన అనసూయ- మీరు ఒక లుక్ వేయండి
అందాల భామ అనసూయ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గానే కాదు నటిగాను ఈమె ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుంది. ఇక వీలున్నప్పుడల్లా చిందులేస్తూ యూత్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. జబర్ధస్త్ అనే కామెడీ షోను హోస్ట్ చేస్తున్న అనసూయ ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమాలోని జివ్వుమని కొండగాలి అనే పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసింది. అనసూయ డ్యాన్స్‌ను చూసి నెటిజన్స్ మంత్రముగ్దులవుతున్నారు. …
Read More »