తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివ విద్యానికేతన్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు …
Read More »TimeLine Layout
March, 2021
-
14 March
జీహెచ్ఎంసీలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 46 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,257 కరోనా కేసులు నమోదయ్యా యి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More » -
14 March
ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ …
Read More » -
14 March
దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,637 మంది కరోనా నుంచి కోలుకోగా, 161 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. ఇప్పటివరకు 1,09,89,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,607 మంది మరణించారు
Read More » -
14 March
పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More » -
13 March
టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు మంత్రి కేటీఆర్ “సర్ ప్రైజ్ గిఫ్ట్”
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ …
Read More » -
13 March
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
దేశంలో కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా.. దక్షిణ మధ్య రైల్వే రైలు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. తాజాగా ఏప్రిల్ 1 నుంచి విజయవాడ మీదుగా మరో 12 రైళ్లను ప్రారంభించనుంది. ఇందులో రోజువారి ఎక్స్ ప్రెస్, వారాంతపు సర్వీసులు ఉన్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే ద.మ రైల్వే నడపనుండగా.. ఈ రైళ్ల టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Read More » -
13 March
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 52 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More » -
13 March
బీట్ రూట్ జ్యూస్ తాగితే
నీరసంగా ఉండేవారు రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు రక్తహీనతతో బాధపడేవారు తాగితే చాలా త్వరగా రక్తం తయారవుతుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె రాకుండా అడ్డుకుంటుంది జబ్బులు ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్భిణీలు తాగితే కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది బిడ్డ ఎదుగుదల సరిగా ఉండేందుకు సహకరిస్తుంది
Read More » -
13 March
కృతిశెట్టికి బంపర్ ఆఫర్
ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నాని, రామ్ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుకు.. తాజాగా మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ సొట్టబుగ్గల సుందరిని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది
Read More »