ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు ఉల్లిపై తెగ లొల్లి చేశారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తెదేపా నేతలు అనంతరం ఉల్లిదండలతో, ప్లకార్డులతో కాలినడకన అసెంబ్లీకి వెళ్ళారు. కిలో ఉల్లి రూ.200 సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. లోకేష్ బాబు ఉల్లిదండను మెడలో వేసుకుని ఫోటోలకు ఫోటోలు ఇస్తే..బాబుగారేమో ఉల్లిదండను అలా స్టైల్‌గా చేత్తో పట్టుకుని అసెంబ్లీ వరకు నడిచారు. ఇక మరో పార్టనర్ …
Read More »అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …
Read More »చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌లను ఏకి పారేసిన ఎమ్మెల్యే రోజా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో …
Read More »టీడీపీ అధినేతపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత,కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీ సభ్యత్వానికి.. ఆ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. అనంతరం ఆయన మీడియాతో …
Read More »బీజేపీతో బంధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వామపక్షాల ఆగ్రహం..!
బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ …
Read More »బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!
దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే హక్కు లేదంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …
Read More »అమరావతిపై అఖిలపక్షం పెట్టి తన పరువు తానేతీసుకున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు తానే పరువు తీసుకుంటున్నాడు..అధికారంలోకి వచ్చి ఆరునెలల కూడా కాకముందే వైసీపీ సర్కార్‌పై రోజుకో టాపిక్ పట్టుకుని బురద జల్లుతున్నాడు. అమరావతి నుంచి రాజధాని తరలింపు, పోలవరం, రివర్స్ టెండరింగ్, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య డ్రామా, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశం పట్టుకుని ఆరునెలలుగా ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు..బాబుగారి …
Read More »మా చినబాబు హిందీలో ఇరగదీసాడు అంటూ పండుగ చేసుకుంటున్న ఎల్లోమీడియా..!
టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్ర రత్నం లోకేష్ గారి భాషా ప్రావీణ్యం గురించి మనకందరికి తెలిసిందే..తెలుగు భాషలోనే తడబడుతూ మాట్లాడుతూ పలుసార్లు నవ్వుల పాలయ్యాడు.. అందుకే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ..పప్పులాంటి అబ్బాయి అంటూ లో్కేష్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. తన కొడుకు భాషా ప్రావీణ్యాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఏకంగా లోకేష్‌కు తెలుగు ట్యూషన్ కూడా పెట్టించాడు..అయినా ఫలితం లేకుండా పోయింది…డెంగ్యూ జ్వరాన్ని బూతుపదం అర్థం వచ్చేలా పలికి ప్రజలనే కాదు..తెలుగు …
Read More »జనసేనానిని చెడుగుడు ఆడేసిన చెవిరెడ్డి..!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడుగా వెళుతున్నారు. తిరుమల డిక్లరేషన్, ఇంగ్లీష్ మీడియం, మతమార్పిడులు, ఉల్లి ధర అంటూ పలు అంశాలపై వైసీపీ సర్కార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పదే పదే జగన్ రెడ్డి అంటూ, ఆయన కులం, మతంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశంపై స్పందిస్తూ..సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్ విమర్శలను వైసీపీ …
Read More »