ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం …
Read More »ఏపీలో రేపే గ్రామ సచివాలయం పరీక్షలు..షెడ్యూలు ఇదే..
ఏపీలోని అన్ని జిల్లాలో గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరాయి. కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. అన్ని జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షల షెడ్యూలు ఇదే.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2, 5 తేదీలు మినహా మిగిలిన తేదీల్లో నిర్వహించే …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా
టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి గత ప్రాభవాన్ని కోల్పోయింది. మూడు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనానికి ఆ పార్టీ కోటలు కుప్పకూలిపోయాయి గడిచిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక మాకు రాజకీయ భవిష్యత్ ఉండదని మరో 20 ఏళ్లు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఉండబోతున్నారని తెలుసుకోని వైసీపీలో చేరుతన్నట్లు సమచారం. …
Read More »చంద్రబాబుకు షాక్ న్యూస్…మరో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూత
తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి నూకలు దగ్గర పడ్డాయని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని మార్పుపై స్పష్టత నివ్వాలని …
Read More »చింతమనేని ప్రభాకర్ ఎక్కడ ఉన్న తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశం..ప్రత్యేక బృందాలు రంగంలోకి
దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం …
Read More »వన మహోత్సవానికి సీఎం వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సభావేదిక పక్కనే ఉన్న అటవీశాఖ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు సభావేదికపై సీఎం జగన్ ప్రసంగించనున్నారు.అందుకు సంబంధించి జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లాలోని మేడికొండూరు మండలంలోని పేరేచర్ల సమీపంలో డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతానికి ఆనుకొనివున్న ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలో …
Read More »ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు..ఇద్దరు అరెస్టు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు… ఎమ్మెల్యే రజిని గౌరవానికి భంగం కలిగేలా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోస్టింగ్‌లు పెడుతున్న పి.కోటేశ్వరరావు, బాలాజీసింగ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే చట్టపరంగా చర్యలు …
Read More »తెలుగుదేశంపై మంత్రి కొడాలి నాని ఫైర్..చంద్రబాబుకు చాలా ఘాటుగా సమాధానం
రాజధానిని మారుస్తామని.. పోలవరం ప్రాజెక్టును నిలిపేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. – ఈరోజు సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అమరావతి, పోలవరంపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. – గత ఐదేళ్లుగా కేవలం అమరావతి-పోలవరం భజన చేయడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా …
Read More »ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి 10వేలు ఇవ్వబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన
సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ …
Read More »కన్నా పోస్ట్ కు కన్నం వేసిన …సుజనా, సీఎం రమేష్
బీజేపీ లో చేరిన టీడీపీ మాజీ నేత, ఎమ్.పి సుజనా చౌదరి చక్రం తిప్పుతున్నట్లే ఉంది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుపుకుని ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. సుజనా చౌదరి రేపు రాజదాని గ్రామాలలో తిరుగుతారని, కన్నా కూడా పాల్గొంటారని టీడీపీ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి.అయితే సహజంగానే ఈ టూర్ లో సుజనా కు ప్రాదాన్యం వస్తుంది .కన్నా లక్ష్మీనారాయణ తోడు పెళ్లికొడుకు మాదిరి ఉంటారా?సుజనా వెంట వెళ్లినట్లు …
Read More »