Home / Tag Archives: boyinapalli vinod kumar

Tag Archives: boyinapalli vinod kumar

తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింది -బి. వినోద్ కుమార్‌

కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయింద‌ని రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. అజిత్‌సింగ్ మ‌ర‌ణంపై వినోద్‌కుమార్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తనకు అత్యంత సన్నిహితుల‌న్నారు. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన …

Read More »

ఈట‌ల అలా వ్యాఖ్యానించ‌డం స‌రికాదు : వినోద్ కుమార్

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శిస్తూ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ త‌ప్పుబ‌ట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌జా నాయ‌కుడు కేసీఆర్‌ను ఈట‌ల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాలైన రైతుబంధు, ఆస‌రా పెన్ష‌న్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ వంటి ప‌థ‌కాల‌ను ఈట‌ల విమ‌ర్శించారు. బ‌డుగు బల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయ‌కుడు ఆ ప‌థ‌కాల‌ను …

Read More »

అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్‌-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్‌-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్‌-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్‌సిం గ్‌, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …

Read More »

అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …

Read More »

వైబ్రాన్ట్ తెలంగాణ ‘ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …

Read More »

తెలంగాణకు కేంద్రం అన్యాయం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ …

Read More »

ఎన్నికలను అలా నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర ఉప ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపా బజ్వాను కలిశారు. రానున్న జనవరి నెలలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో మహరాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లోని కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ …

Read More »