ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో మృతి చెందగా.. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు. ‘రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నేత. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అటు సోమువీర్రాజు కూడా సంతాపం తెలియజేశారు.
Read More »