సౌతాఫ్రికాతో రెండో వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున వన్డే క్రికెట్లో రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్ు 13 సార్లు డకౌట్ కాగా, కోహ్లి వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా, సెహ్వాగ్, జహీర్ తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరికంటే ముందు సచిన్ (20 డకౌట్లు), జగవల్ శ్రీనాథ్ (19 డకౌట్లు), అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ …
Read More »వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఓడిన భారత్.. తాజాగా వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. ఈ రోజు జరిగిన 2వ కీలక వన్డేలో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 287/6 స్కోర్ చేసింది. ఛేజింగ్కి దిగిన సౌతాఫ్రికా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.1 ఓవర్లలో రన్స్ చేధించింది. దీంతో మరో వన్డే మ్యాచ్ ఉండగానే …
Read More »36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో జేసన్ రాయ్ విధ్వంసం
ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్ 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొని 115 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్క ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 137 రన్స్క చేతులెత్తేసింది.
Read More »విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలు ఇవే..?
టీమిండియా పరుగుల మిషన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలను అనేక మంది పలు రకాలుగా చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత బయోబబుల్స్ కారణంగా కుటుంబానికి దూరం కావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్పై దృష్టి సారిస్తాడని వివరించాడు
Read More »నేడే సౌతాఫ్రికా-టీమిండియా మధ్య రెండో వన్డే
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ఇప్పటికే కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమి పాలైన టీమిండియాకు నేడు చావోరేవో మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 1లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. వరుస విజయాలతో దక్షిణాఫ్రికా ఉత్సాహంతో ఉండగా, ఎలాగైనా రెండో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో ఇరు మార్పుల్లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది.
Read More »తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం
మూడు వన్డేల సీరిస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల దాటికి 265/8 పరుగులకే పరిమితం అయ్యింది. చివర్లో శార్థూల్(50*) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. ధావన్ 79, కోహ్లి 51 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, షంసీ, ఫెహ్లుక్వాయో తలో 2వికెట్లు తీయగా, మహరాజ్, మార్క్రమ్ …
Read More »మరో ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ (5,065) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. ధోనీ (4,520), రాహుల్ ద్రావిడ్ (3,998), సౌరభ్ గంగూలీ(3,468) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read More »భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్
మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి సాధారణ బ్యాటర్గా బరిలో దిగనున్నాడు. కెప్టెన్ రాహుల్, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ …
Read More »విరాట్ కోహ్లి ప్రకటనపై బీసీసీఐ స్పందన
భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. ‘కోహ్లికి ధన్యవాదాలు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావు. 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచావు కోహ్లి’ అని బీసీసీఐ తెలిపింది.
Read More »ఇంగ్లండ్ 188 పరుగులకే ఆలౌట్
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ రెండో రోజు ఇంగ్లండ్ 188 పరుగులకే కుప్పకూలింది. మరోసారి ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. క్రిస్ వోక్స్(36), రూట్ (34), బిల్లింగ్స్ (29), మలాన్(25) క్రావ్ (18) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ (4వికెట్లు), స్టార్క్ (3వికెట్లు), బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 303 …
Read More »