టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురి సంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి పాటలను పాడారు. ‘పండంటి కాపురం’, ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.
Read More »