తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో దిగారు. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి …
Read More »కాంగ్రెస్ కంచుకోటకు కారు బీటలు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అడ్డా.. అందులో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ ఇలాఖా. అందులోనూ ఆ పార్టీ తెలంగాణ విభాగ అధ్యక్షుడు.. నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో …
Read More »హుజూర్ నగర్ ఫలితాలపై కన్పించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమే అని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలైన ఉప ఎన్నికల …
Read More »తెలంగాణ హోమ్ శాఖ కార్యదర్శి మార్పు
తెలంగాణ రాష్ట్ర హోం శాఖలో రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. అందులో భాగంగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా రవిగుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజీవ్ త్రివేది ను నియమించింది. అయితే ప్రస్తుతం రవి గుప్తా తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read More »ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కూడిన ఆరుగురు అధికారులతో పాటుగా హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో అధ్యయనం …
Read More »తెలంగాణ హైకోర్టులో ఫిటిషన్
తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ సిబ్బంది గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్టీసీ సిబ్బందితో చర్చలు జరపాలని సూచించింది. అయితే తాజాగా ఆర్టీసీలో బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. ఆర్టీసీకి బోర్డుకు లేకుండా ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధం అని ఫిటిషన్ పేర్కొన్నారు. సమ్మెపై ఏ …
Read More »మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూసిన వారికి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది. దీంతో త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం …
Read More »తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్
తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన …
Read More »ఫలించిన చర్చలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …
Read More »హుజూర్ నగర్ ప్రచారం బంద్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నది. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పర్వంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి …
Read More »