తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేశారు. శాసనసభలో అక్టోబర్ ఒకటిన సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈ మేరకు దీనిపై ఉత్తర్వులు …
Read More »నేడు టీఆర్‌ఎస్ కీలక భేటీ -పార్టీ ప్రజాప్రతినిధులతో గులాబీ దళపతి కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా …
Read More »రాష్ట్ర నిధులతోనే కాళేశ్వరం..
ప్రతిష్ఠాత్మక బహుళదశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత వనరులతోనే నిర్మిస్తున్నదని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్‌సభలో వెల్లడించారు.నిర్మాణ పనులకు ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని అనుసరించిందని చెప్పారు. గురువారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాళేశ్వరానికి అనుమతులున్నాయా? ఎంత ఖర్చు చేశారు? ప్రాజె క్టు ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నకు షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జల్‌శక్తి శాఖలోని సాగునీరు, …
Read More »ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం విజయం
ఉమ్మడి నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం విజయం సాధించారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా… 1183 ఓట్లు చెల్లాయి. చెల్లని ఓట్లు 50. గెలుపు కోటా 593 కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తమ్మీద 691 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు
Read More »ఉమ్మడి ఖమ్మంలో క్రాస్ ఓటింగ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వాస్తవంగా 116 ఓట్లు ఉండగా.. 239 ఓట్లు పడ్డాయి. దీన్నిబట్టి ఇతర పార్టీల ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర రావుకు ఓటేశారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు రాగా.. ఆయన రాయలపై 247 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read More »మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS విజయం
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఇవాల్టి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి. అయితే ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి 762 ఓట్లు పొంది విజయం సాధించారు.
Read More »గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి
తెలంగాణ రాష్ట్రంలోని గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2018లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధుసూదనాచారి.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
Read More »డాక్టర్ల కృషి మరువలేనిది
కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు. అందులోనూ …
Read More »స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపితమైంది. ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊహాల్లో విహరిస్తున్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ …
Read More »టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన …
Read More »