Home / Tag Archives: sports news (page 18)

Tag Archives: sports news

అంతర్జాతీయ క్రికెట్ కి రాస్ టేలర్ గుడ్ బై

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్తో త్వరలో జరగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్తో ఆరు వన్డేల అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. గత 17 ఏళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పి టేలర్.. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ట్వీట్ చేశాడు.

Read More »

కోలుకుంటున్న దాదా

ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.

Read More »

ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి వారసుడోచ్చాడు

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తండ్రయ్యాడు. తనకు మరో కుమారుడు జన్మించినట్లు పఠాన్ వెల్లడించాడు. కీలక ఆల్రౌండర్గా టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ఇర్ఫాన్.. 2016లో హైదరాబాద్ మోడల్ సాఫా బైగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు (ఇమ్రాన్ ఖాన్ పఠాన్) ఉన్నాడు. తమ రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పఠాన్ వెల్లడించాడు.

Read More »

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. తక్కువ టెస్టు మ్యాచ్లో 100 మందిని ఔట్ చేసిన భారత కీపర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పంత్.. ధోని, సాహా రికార్డులను బ్రేక్ చేశాడు. ధోనీ, సాహా 36 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా పంత్ కేవలం 26 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేశాడు. ఇక కేవలం 21 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేసిన  …

Read More »

భారత ఓపెనర్ రాహుల్ మరో రికార్డు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.

Read More »

కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …

Read More »

పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ

ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

Read More »

కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.

Read More »

Cricket బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలి- రవిశాస్త్రి

పన్ను పరంగా చూస్తే బెట్టింగ్.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని, భారతదేశంలో బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఒక మీడియా కార్యక్రమంలో బెట్టింగ్ పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగాన్ని ఎంతగా అణచివేయాలని చూసినా కుదరదని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న మార్గమిదే అని రవిశాస్త్రి చెప్పాడు.

Read More »

నాదల్ కు కరోనా

స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat