ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చినకాకానిలో జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ మేరకు పోలీసులు దాడికి పాల్పడిన పదిమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడికి పాల్పడింది..రైతులు కాదు చంద్రబాబు మనుషులే అని పిన్నెల్లితో సహా, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా …
Read More »చంద్రబాబు నువ్వు మగాడివైతే.. డెరెక్ట్‌గా టచ్ చేసి చూడు…!
అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారింది. గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకున్న కొందరు ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అంతే కాదు అడ్డుకోబోయిన పిన్నెల్లి గన్‌మెన్‌లపై కూడా భౌతికదాడికి పాల్పడ్డారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. పిన్నెల్లి మాత్రం సంయమనం పాటించి…గన్ ఫైరింగ్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. …
Read More »పిన్నెల్లిపై దాడి..10 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్..!
అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా చినకాకానిలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్షారెడ్డిపై దాడి జరిగిందని తెలుస్తోంది. పిన్నెల్లిపై జరిగిన దాడిపై జగన్ సర్కార్ సీరియస్ అయింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో, ముఖ్యంగా ఆందోళనకారులను అదుపులో ఉంచడంలో పోలీసులు విఫలం అయ్యారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ‌్యంలో పిన్నెల్లిపై జరిగిన దాడిపై …
Read More »రైతుల ముసుగులో దాడి చేసింది టీడీపీ కార్యకర్తలే…పిన్నెల్లి …!
మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలు హింసాత్మకంగా మారుతున్నాయి. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామరామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి ఆయన కారు అద్దాల పగులబెట్టి..ఆయనపై భౌతిక దాడికి ప్రయత్నించారు. పిన్నెల్లి గన్‌మెన్లు, డ్రైవర్లపై కూడా దాడికి తెగబడడం చూస్తుంటే.. పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై జరిగిన …
Read More »రైతుల ముసుగులో టీడీపీ నేతల అరాచకం..సీఎం జగన్ ఫ్లెక్సీకి అవమానం..!
ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి గ్రామాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రెండు కమిటీలు మూడు రాజధానులకు సానుకూలంగా నివేదికలు ఇవ్వడంతో హైపవర్ కమిటీ భేటీ తర్వాత మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో …
Read More »ఏపీని అగ్నిగుండంగా మార్చేందుకు టీడీపీ కుట్ర..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్ర సమస్యగా వక్రీకరించడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విజయవాడకు వచ్చి హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత లేదంటూ, సెక్షన్ 8 అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేయించాడు. కేవలం ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం తెలుగు …
Read More »బ్రేకింగ్..అమరావతిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రైతులు..!
అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు అడుగడుగునా రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం నల్ల జెండాలు, పోస్టర్లతో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతల దాడులపై రాజధాని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్థం చేశారు. రాజధాని పేరుతో అందరికీ ప్లాట్లు, ఇంటికో ఉద్యోగం, ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తానని …
Read More »అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన…వీడియో..!
అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకుంటూ..గో బ్యాక్ అంటూ దళిత రైతులు నినదిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని అసైన్డ్ భూముల రైతులు, లంక భూముల రైతులకు అన్యాయం చేస్తూ..జీవో నెం.41 జారీ చేసినందుకుగాను..గో బ్యాక్ బాబూ అంటూ బ్యానర్లతో చంద్రబాబుకు రైతన్నలు నిరసిన తెలిపారు. చంద్రబాబు రాజధాని రైతు కూలీలకు 365 రోజుల …
Read More »కడపలో తెలుగు తమ్ముళ్ల రివర్స్ క్లాస్.. అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు..!
బొమ్మరిల్లు సినిమా గుర్తుంది కదా..అందులో తండ్రి అతి క్రమశిక్షణ వల్ల హీరో సిద్ధార్త్ బాగా ఇబ్బంది పడతాడు..చివరకు క్లైమాక్స్‌లో అంతా మీరే చేశారంటూ..తండ్రి ప్రకాష్ రాజ్‌కు రివర్స్ క్లాస్ తీసుకుంటాడు.. తాజాగా రాజకీయాల్లో అంతా నేనే..అంతా నావల్లే, నేను నిప్పు అని చెప్పుకునే బొమ్మరిల్లు బాబుగారికి తెలుగు తమ్ముళ్లు ఏకంగా క్లాస్ తీసుకున్న వైనం ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఏపీలో రోజు రోజుకీ పతనమవుతున్న పార్టీని బతికించుకునేందుకు. . …
Read More »సంచలనం..కడప గడ్డపై నారావారికి ఘోర అవమానం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప గడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది..నవంబర్ 26, మంగళవారం నాడు కడపలో చంద్రబాబు టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను బాబు ముందు ఏకరువు పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని వారు బాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు …
Read More »