ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపన రేపుతోంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో విషం కక్కిన చంద్రబాబుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో రాజధానిగా ప్రకటించక ముందు నుంచే చంద్రబాబు, టీడీపీ నేతలు, ఒక సామాజికవర్గం పెద్దలు బినామీల పేరుతో రైతుల దగ్గర భూములును చవక ధరకు కొనుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి …
Read More »భారీ సంఖ్యలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీసీలో చేరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని …
Read More »కర్నూలు జిల్లాలో చంద్రబాబు ముందే టీడీపీ నేతలు వాగ్వాదం
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు కర్నూలు చంద్రబాబు పర్యటన సాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. రెండవ రోజు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించారు. నేడు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో …
Read More »చంద్రబాబుకు కర్నూలులో ఇద్దరు షాక్..మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్‌గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు డుమ్మా కొట్టారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో రెండో రోజు మంగళవారం …
Read More »పార్టీ మార్పుపై టీడీపీ నేతల విమర్శలపై మండిపడిన దేవినేని అవినాష్..!
విజయవాడలో ఇసుకదీక్ష రోజునే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇసుకదీక్ష జరుగుతున్న సమయంలో టీడీపీ కీలక నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రజారంజకపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించి, చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో వంశీ, …
Read More »మీ పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకుంటే..పేద పిల్లలు తెలుగులో చదవాలా..కొడాలి నాని
ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. …
Read More »ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ మహిళకు 10 వేల ఈమెయిల్స్ పెట్టిన టీడీపీ నేత ఎవరు..?
తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్‌ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను …
Read More »హవ్వ ..బాబుగారి ఇసుకదీక్షకు.. ఏపీ కూలీలు ఎవరు దొరకలేదంట.. తెలంగాణ కూలీలను తరలించారంట..!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బాబుగారి ఇసుక దీక్ష తెలుగు తమ్ముళ్ల చావుకు వచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలంటే. నా దీక్షకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను తరలించారని బాబుగారు స్వయంగా టీడీపీ నేతలకు హుకుం జారీ చేశారంట…అయితే స్థానికంగా రాజధాని …
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీకీ భారీ షాక్…వైసీపీలో చేరిన 300 కుటుంబాలు…!
కర్నూలు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో జగన్ హవాతో 10 కు పది స్థానాలు గెల్చుకుని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ జిల్లాలో అన్ని స్థానాల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సీమ జిల్లాల్లో టీడీపీని పూర్తిగా ముంచేస్తోంది. రాజధాని తరలింపు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు..ముఖ్యంగా సీమ టీడీపీ నేతలు అమరావతికి మద్దతు …
Read More »విశాఖలో బయటపడిన మరో భారీ భూకుంభకోణం..!
టీడీపీ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో విశాఖ భూకుంభకోణం ఒకటి. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు. ఈ భూకుంభకోణంలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా, అమరావతి పెద్దల …
Read More »