కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …
Read More »దుమ్ముగూడెం వద్ద బరాజ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నదిలో అత్యధికంగా నీళ్లు ఎక్కువగా అంటే ఏడాదికి ఐదారు నెలలు పాటు నిల్వ ఉండే చోటు దుమ్ముగూడెం. దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినేట్ సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,482కోట్ల అంచనా …
Read More »తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ప్రగతి భవన్ లో జరిగింది. 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుమ్ముగూడెం వద్ద …
Read More »కంటి వెలుగు పథకం మాదిరి రాష్ట్ర ఆరోగ్య సూచిక
తెలంగాణ వ్యాప్తంగా విజయవంతమైన కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్ ప్రొఫైల్ ఉంటుంది. హెల్త్ ప్రొఫైల్ …
Read More »గర్వపడుతున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీరామారావు ట్విట్టర్ సాక్షిగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు రావడంపై స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్” గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్లలో చెరగని సంతోషం నిండుకున్నది. తెలంగాణ కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు వేసిన జలబాటలు.. శ్రీరాజరాజేశ్వర …
Read More »ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ …
Read More »తెలంగాణలో గ్రామాలకు మహర్దశ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నది. గత సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు నిర్వహించిన పల్లెప్రగతిలో గుర్తించిన పనులన్నీ ప్రాధాన్య క్రమంలో చేపడుతున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు ఉపాధిహామీ పథకం నిధులను వినియోగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఉపాధిహామీ పథకం కింద …
Read More »తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ తమిళ సై నిన్న మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్‌లను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ అత్యంత …
Read More »ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన
పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …
Read More »సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి
తెలంగాణ అన్ని మతాల ప్రజల నివాసానికి సముహారంగా నిలుస్తోందని, మైనారిటీ ల ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం పరిరక్షించ గలుగుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి కార్యక్రమం సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది. సితాఫలమంది లో ని చర్చి అఫ్ లేడీ ఆఫ్ పెర్పేతుయాల్ హెల్ప్ లో నిర్వహించిన కానుకల పంపిణి కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ …
Read More »