తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …
Read More »ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …
Read More »దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు. అలా పుట్టడం వారి తప్పు కాదు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …
Read More »ఎంపీ సంతోష్ కు మంత్రి కేటీఆర్ విషెస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు. ఈ …
Read More »బస్ పాసు చార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Read More »ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్. దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజాతో …
Read More »విజయవంతమవుతున్న గ్రీన్ ఛాలేంజ్
నేలంతా పచ్చగా ఉంటే.. మనుషులంతా చల్లగా ఉంటారనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మాటలతో స్పూర్తిపొంది.. గత యేడాది నేను ప్రారంభించి గ్రీన్ ఛాలేంజ్ దిన దిన ప్రవర్ధమానంగా ప్రజ్వరిల్లుతూ.. కోట్లాది హృదయాలను కదిలించడం.. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మొక్కను నాటి మరో …
Read More »సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు వేదిక
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …
Read More »రెవెన్యూ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సత్వరసేవలు అందించేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 107 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూలోనే ఇన్నిరకాల చట్టాలు అమల్లో ఉండటంతో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఏ చట్టం ద్వారా పరిశీలించి పరిష్కరించాలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్ట్(బీ)లో పేర్కొన్న భూ సమస్యలు చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యలకు తోడు రెవెన్యూ …
Read More »తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరో ముందడుగు
ఆర్టీసీ సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని ఈ రోజు శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా సమ్మె కాలంలో మరణించిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తానని కూడా ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 97 డిపోల నుంచి ఐదుగురు …
Read More »