నిన్న గురువారం రోజున ముంపుకు గురైన నిర్మల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …
Read More »గొల్ల, కురుమలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి …
Read More »అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం
పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా …
Read More »ఈ నెల 26న దళితబంధు పై సీఎం కేసీఆర్ సమావేశం
దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించనున్న దళితబంధు పథకంపై తొలి అవగాహన సదస్సు ఈ నెల 26న ప్రగతిభవన్‌లో జరుగనున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు …
Read More »పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్
నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.nఆర్థిక పునరావాస పథకం ద్వారా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఐదుగురు దివ్యాంగులకు మంజూరైన 50 వేల రూపాయల చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక పునరావాస పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీతో కూడిన …
Read More »థ్యాంక్యూ కేటీఆర్ అన్నయ్య-ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
తన బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పందించారు. ముక్కోటి వృక్షార్చనలో లేదా గిప్ట్ ఏ స్మైల్‌లో భాగస్వామ్యం …
Read More »భారీ వర్షాల కారణంగా యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ …
Read More »పెద్ది రాజిరెడ్డి గారికి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రోజున ఆయన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్న ఆయన పెద్ది రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …
Read More »రైఫిల్ షూటింగ్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులకు చీర్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలంపిక్స్ 2020 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. అనంతరం రైఫిల్ షూటింగ్ లో …
Read More »పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పైమంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతి పై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో డిజిపి మహేందర్ రెడ్డి,హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్,ఆర్ అండ్ బి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి …
Read More »