Home / Tag Archives: telanganacm (page 327)

Tag Archives: telanganacm

తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా..?

తెలంగాణలో లాక్డౌన్ను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై 20న కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ‘ఆస్క్ మంత్రి కేటీఆర్’ లో మంత్రి KTR ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే పూర్తి లాక్డౌన్ విధించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పారు. 4 గంటలకు మించి సడలింపులు ఇచ్చే అవకాశం లేదన్నారు. అటు త్వరలోనే తానూ ప్లాస్మా దానం చేస్తానన్నారు. కరోనా వస్తే మానసికంగా దృఢంగా ఉండాలని, సొంత వైద్యం వద్దని, వ్యాయామం చేయాలని చెప్పారు.

Read More »

సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. శాంతి, ప్రేమ, దయను పంచుతోందన్నారు. రాష్ట్రంలో గంగా జమునా తహజీబు రంజాన్ పండగ ప్రతీక అని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముస్లింల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 71,221 టెస్టులు చేయగా.. 4,693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 734 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. 6,876 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా  రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

మంత్రి కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా క‌ట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నారు. క‌రోనా ప‌రిస్థితుల‌పై చ‌ర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం సాయంత్రం మంత్రి కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న తాత్కాలిక స‌చివాల‌య భ‌వ‌నంలోని సీఎస్ కార్యాల‌యంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ …

Read More »

తెలంగాణలో వ్యవసాయ రంగానికి లాక్డౌన్ మినహాయింపు

తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా.. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లులకు లాక్ డౌన్ వర్తించదు. FCIకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, సంబంధిత రవాణా, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం యథావిథిగా కొనసాగించనుంది.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు వీటికే…

తెలంగాణలో రేపటి నుండి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అయితే    లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : – వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. – …

Read More »

తెలంగాణలో 7ఎమ్మెల్సీలు ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటిలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న పూర్తవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ఖాతాలోని ఈ స్థానాలు తిరిగి ఆ …

Read More »

తెలంగాణలోని పల్లెల్లో కరోనా విజృంభణ

తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.

Read More »

పుట్ట మధు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు …

Read More »

తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు

తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat