రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?. 13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. …
Read More »ఆదర్శంగా నిలిచిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది
అతనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకోవాలని తలచాడు.. అతనికి కారు ఉంది..వీఐపీ దర్శనానికి అవకాశం కూడా ఉంది.. కానీ వీఐపీ కల్చర్ వద్దనుకున్నాడు..ప్రజలకు ఇబ్బంది కలగకూడదనుకున్నాడు అందుకే TSRTC బస్సు ఎక్కాడు..అతనెవరో కాదు నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమనేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..వీఐపీ దర్శనం వద్దు సామాన్య దర్శనం ముద్దు అనే అతని నిర్ణయం ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది.. మేడారం జాతర నేపద్యంలో …
Read More »మేడారం జాతరకు సకల వసతులు
ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో …
Read More »తెలంగాణలో మరో రెండు రెవిన్యూ డివిజన్లు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జోగిపేట,సిరిసిల్ల జిల్లాలో వేములవాడలను కొత్త రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ తెలిపింది. దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లోని స్థానికులు,ప్రజాప్ర్తతినిధులు,అభ్యర్థుల నుండి అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ రెండు డివిజన్లతో రాష్ట్రంలో రెవిన్యూ డివిజన్లు డెబ్బై నాలుగుకు చేరనున్నాయి..
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఎమ్మెల్యే సతీమణి
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి గారు మొక్కలు నాటారు . వారితో పాటు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక గారు కూడా పాల్గొన్నారు. కాంతారావు గారు ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గాన్ని మొక్కలు నాటి , రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని …
Read More »ఆ వార్తలు అవాస్తవం- మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారని గత కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్నాను.. పని చేస్తానని జూపల్లి ఉద్ఘాటించారు. తనంటే గిట్టని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమదంతా టీఆర్‌ఎస్ కుటుంబమేనని …
Read More »మాజీ మంత్రి మృతి
తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి (78) మృతిచెందారు. దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న ఆయన యశో ద దవాఖానాలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల గ్రామానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేందర్‌రెడ్డి మృతికి సీఎం కే చంద్రశేఖర్‌రావు సం తాపం వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను అధికారలాంఛనాలతో నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోమవా …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఇంతకు ముందు కేటీఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర అభ్యున్నతి, పెట్టుబడుల గురించి మాట్లాడారు. తాజాగా, అమెరికా.. బోస్టన్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనున్న హర్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్-2020లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. 17వ ఇండియా కాన్ఫరెన్స్-2020కి పలువురు కీలక వ్యక్తులకు ఆహ్వానం అందింది. …
Read More »యువతి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రిప్లై
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నాడనే సంగతి విదితమే. తాజాగా ఒక యువతి తన తల్లిని కాపాడాలని ట్వీట్ చేసింది. బీహార్లో ఎవరో తన తల్లిని కిడ్నాప్ చేశారు. ఏలాగైన సరే కాపాడాలని ఆ యువతి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్లో కోరింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ …
Read More »మేడారం జాతరకు పోటెత్తున్న భక్తులు
ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది. ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు. రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు …
Read More »