వెండితెరపై అందంతో ఆకట్టుకునే హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లో నెగటివ్ షేడ్స్ ఉన్న డీగ్లామరస్ పాత్ర చేసింది. ఈ ప్రాజెక్టు ప్రమోషన్లలో సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో చాలా టాలెంట్ ఉందని కొనియాడింది. ఇంకా అవకాశమొస్తే రణ్ బీర్ కపూర్తో కలిసి నటించాలని ఉందని తెలిపింది. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, తమిల్లో ‘కాతు వాకులా రెండు కాదల్ అనే చిత్రాలు …
Read More »RGV ఇంట్లో విషాదం
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.
Read More »మధుప్రియకు తప్పని వేధింపులు
తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు దర్యాపు చేపట్టారు.
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం
తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్‌బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »నెటిజన్లకు నయనతార సలహాలు
స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్ చేసి …
Read More »హీరో మనోజ్ సంచలన నిర్ణయం
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న పాతికవేల కుటుంబాలకు సాయం అందించాలని మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభించాం. నేను, నా అభిమానులు, మిత్రులు కలసి భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. కరోనా ఉధృతి ఉంది. కనుక దయచేసి అందరూ ఇళ్లల్లో ఉండి… మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. తమ జీవితాల్ని, కుటుంబ సభ్యుల …
Read More »మెగాస్టార్ సంచలన నిర్ణయం
అప్పట్లో రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998 చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కొంత కారణం ఆక్సిజన్ కొరత. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో ఆయన ఆక్సిజన్ …
Read More »సమంత గొప్ప మనస్సు
ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ సమంత.. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సన్టర్లను, ఎంఎస్ఎం ల్యాబొరేటరీ ద్వారా 2 ఆక్సిజన్ కాన్సన్టర్లను అందజేశారు. వాటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆసుపత్రికి అప్పగించారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి ప్రయివేట్ వ్యక్తుల తోడ్పాటు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
Read More »