తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్.. నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్‌కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం …
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక: అప్‌డేట్స్
నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా …
Read More »సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకు నాంది
ఏడేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు నాంది పలుకుతాయాని నారాయణఖేడ్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల నార్సింగి మండల ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని భీమ్‌రావుపల్లి, వల్లూరు, నార్సింగి గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం రైతు బంధు, …
Read More »నేటి నుంచే బతుకమ్మ చీరెల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడుపడుచులకు ప్రభుత్వం అం దించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారుచేసిన కోటి చీరెలను ఇప్పటికే జిల్లాలకు పంపించారు. వీటి కోసం రూ.317 కోట్లను ప్రభుత్వం వెచ్చింది. తెల్లకార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరెలను పంపిణీ …
Read More »గూడు నిలిచింది.. గుండె కదిలింది
నాకిప్పటికీ నమ్మబుద్దెయ్యడంలేదు.. నాకు ఇల్లు వస్తుందని కలలో కూడా ఊహించలేదు.. ఇది తునికి భాగ్యమ్మ సంబురం! పేదలు అత్మగౌరవంతో బతుకాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు మేడ్చల్ జిల్లా చీర్యాల్‌లో లక్కీడ్రా తీస్తే పేరు వచ్చిన నిరుపేద లబ్ధిదారు ఈమె! ‘ఎన్నడు ఒక్క వెయ్యి రూపాయలు చూడలే సారూ. నాకు రూ.30-40 లక్షల ఇల్లు వచ్చిందని నిన్న మా పంచాయతీ వాళ్లు వచ్చి చెప్పారు. ఏ …
Read More »ట్విట్టర్ కు స్పందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఎఫ్ సిఐ కాలనీ ఫేస్ 2 నందు ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్న విషయాన్ని ఆ కాలనీవాసురాలు అయిన సురభి మేట్ పల్లి మొదటగా అధికారులకు కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తు అందరిచేత మన్ననలు పొందుతు స్వతహాగా పకృతి ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ …
Read More »ఆడబిడ్డలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్
పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఓదెల మండలంలోని 11 గ్రామాల్లోని 155 మందికి రూ. 1.56 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలోనే 57 ఏళ్ల వయసు నిండిన వారికి పింఛన్ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. మడక చెక్‌డ్యాం కరకట్ట …
Read More »గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణ రాష్ట్రములోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కొనియాడారు. మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట గ్రామాల్లో మంగళవారం సీసీరోడ్లు, కుల సంఘ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. లచ్చక్కపేటలో రూ.2.76 లక్షలతో చేపట్టే గౌడ సంఘ భవనం, రూ.2.76 లక్షలతో చేపట్టే మున్నూరుకాపు సంఘ భవనం, రూ.10 లక్షలతో మూడు సీసీరోడ్లు, నాగునూర్‌లో రూ.2.76 లక్షల చొప్పున రెండు ముదిరాజ్ …
Read More »కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్రం నూతన వ్యవసాయ బిల్లు
కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు …
Read More »జోరుగా కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్
లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల …
Read More »