Home / TELANGANA (page 2)

TELANGANA

ఉద్యమం లాగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం కార్యక్రమంలో పాల్గొనాలి..!!

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో ఉద్యమం లాగా పాల్గొనాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 1 నుండి 8వ తేదీ వరకు నిర్వహించు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉద్యమ స్ఫూర్తి …

Read More »

స్వేచ్చ లభించిన రోజు ఇది..మంత్రి జగదీష్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ దినంగా నిలబడి పోయింది. నిజాం ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలనలో మగ్గి పోయిన తెలంగాణ ప్రజలకు జూన్ 2 నుండి స్వరాష్ట్రంలో సుపరిపాలన అందుబాటులోకీవచ్చిన సుదినం. వచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో యావత్ భారతదేశంలోనే …

Read More »

తెలంగాణ మార్గదర్శి

దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది. పండిన పూటా పండగ చేసుకోలేని దండగమారి సేద్యం బడుగు రైతుల బతుకులతో మృత్యు క్రీడలాడటాన్ని ఓ రైతుగా అవలోకించి, ముఖ్యమంత్రిగా ఆలోచించి, అవరోధాల్ని అధిగమించి చేపట్టిన చర్యలు- దేశ ధాన్యాగారంగా తెలంగాణను సువ్యవస్థీకరించాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, సాంకేతిక అద్భుతమనదగ్గ ప్రాజెక్టులతో బీడు …

Read More »

బహరేన్ దేశంలో తెలంగాణ యువకుడి మృతదేహం స్వగ్రామానికి తరలించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్

  బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ . పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి …

Read More »

మంత్రి కేటీఆర్‌ పిలుపు

సీజనల్‌ వ్యాధుల నివారణకోసం పురపాలకశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ ను ఆదివారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. తన నివాసంలో ఉన్న పూల కుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలిగించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు పేరుకుపోయిందా అని పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహామేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యంపైన ప్రత్యేక స్పృహ …

Read More »

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ

కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చేనేత, టెక్స్‌టైల్‌, అపారెల్‌ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు (యార్న్‌) అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే రెండేండ్లపాటు చేనేతవస్ర్తాలపై పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపులను పరిశీలించాలని సూచించారు. లక్షల మందికి ఉపాధి కల్పించే చేనేత, టెక్స్‌టైల్‌, అపారెల్‌ పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ రంగంపై ఆధారపడినవారికి భరోసా కల్పించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర …

Read More »

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్‌ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో …

Read More »

జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్‌

లాక్‌డౌన్‌ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, ఫిట్‌నెస్‌ స్టూడియోలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్‌ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్‌ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. ఇప్పటికే …

Read More »

తెలంగాణలో 1096 మందికి కరోనా

మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. …

Read More »

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు తేది ఖరారు

తెలంగాణ హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్‌ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మే 6 (బుధవారం) …

Read More »