Breaking News
Home / Tag Archives: cmo

Tag Archives: cmo

చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ,పార్లమెంటరీ నేత కేకే ఆర్టీసీ సిబ్బంది ఆలోచించాలి. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నేతలు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడా …

Read More »

సిరిసిల్ల చీరను కట్టిన న్యూజిలాండ్ ఎంపీ

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులు ప్రపంచంలోని దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికై.. నేతన్నల సంక్షేమంకోసం పలు పథకాలను చేపడుతున్న విషయం మనకు తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్నలు వేసిన చీరను న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ధరించారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా …

Read More »

ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి

ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …

Read More »

ఆర్టీసీలో స‌మ్మె…తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

`ఉమ్మడి ఏపీలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కేవలం రూ.1695కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3303 కోట్లు ఇచ్చింది. తెలంగాణలో దసరా చాలా పెద్ద పండుగ. పండుగ వేళ ప్రజలు ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం` అని ప్ర‌భుత్వం వైపు నుంచి ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ…ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు వెళుతున్న నేప‌థ్యంలో…ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం మొత్తం పదివేల ఆర్టీసీ బస్సులు …

Read More »

నేటి నుంచే తెలంగాణ పల్లె ప్రగతికి బాటలు

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. అయితే తొలి ముప్పై రోజుల ప్రణాళికలో ఏమి ఏమి చేయాలంటే..! -సెప్టెంబర్ 6 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి. -ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలి. -జిల్లాస్థాయిలో …

Read More »

ఘనంగా ‘టాక్’ బోనాల జాతర వేడుక..!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం …

Read More »

4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ …

Read More »

గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్‌ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …

Read More »

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..!

తెలంగాణలో ఇప్పుడు మిషన్ భగీరథనే స్టార్ పెర్ఫార్మర్ అని ప్రశంసించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సబర్వాల్, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. …

Read More »

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …

Read More »