టాలీవుడ్ మాస్ మహారాజు ,స్టార్ హీరో రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోండగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్’.క్యాప్సన్ వెల్కమ్ టూ మై వరల్డ్ . ఈ మూవీ లో రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు .అయితే ఈ మూవీ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.
ఈ క్రమంలో ఈ సినిమాకు చెందిన రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు . హిందీ రీమేక్ హక్కులు రూ. 18 కోట్లకు ఈ చిత్రం అమ్ముడుపోయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
మెహరీన్ రవి పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు. శిరీష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయికార్తీక్ సంగీత దర్శకుడు . ప్రస్తుతం కేరళలో హీరో హీరోయిన్లపై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. రానున్న దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.