మగధీర ఈ సినిమా ఇటు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ కు,మెగా వారసుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు స్టార్డమ్ తీసుకువచ్చిన బిగ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ.. పలు రీకార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సరికొత్త రికార్డులను తిరగరాసింది..అంత ఘన విజయాన్ని సాధించిన ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించాడు..అయితే ఇటీవల జక్కన్న తీసిన బాహుబలి సిరిస్ మాదిరిగా మగధీరకు సీక్వేల్ రానున్నది అని వార్తలు వస్తోన్నాయి.జక్కన్న దర్శకత్వంలో జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ కథ,మాటలు అందించడంతో..రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ మూవీ రానున్నది అని ఆ వార్తల సారాంశం.అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కి జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ ఇంటర్వూ ఇచ్చారు..ఈ ఇంటర్వూలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ బాహుబలి సిరిస్ మాదిరిగా మగధీరకు సీక్వేల్ తీసే అలోచనలో ఉన్నాను..దానికి తగ్గట్లు కథ,మాటలను సిద్ధం చేస్తున్నాను అని అన్నారు.అయితే ఈ ప్రాజెక్టు వచ్చే సంక్రాతికి సెట్ పైకి వస్తుందని కూడా సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నారు..చూడాలి బాహుబలితో ఇండస్ట్రీని షేక్ చేసిన జక్కన్న మగధీర సీక్వేల్ తో ఇంకా ఎన్ని రికార్డలను తిరగరాస్తాడో….?
