Home / MOVIES / నాడు నిశ్ఛితార్థపు చీరపై చైతు ప్రేమ కథ.. మ‌రి నేడు..!

నాడు నిశ్ఛితార్థపు చీరపై చైతు ప్రేమ కథ.. మ‌రి నేడు..!

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క్యూట్ ల‌వ‌ర్స్‌గా చెప్పుకునే స‌మంత‌-నాగ‌చైత‌న్య జంట త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఇక సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే చర్చించుకుంటుంటారు.. ముచ్చ‌టించుకుంటారు. వేడుక ఏ స్థాయిలో జ‌ర‌గ‌నుంది.. ఖ‌ర్చు ఎంత‌.. అతిథులు ఎవ‌రొస్తున్నారు.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్రెస్సింగ్ ఎలా ఉండ‌బోతోంది.. ఇలా ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటారు.

ఇక అప్ప‌ట్లో నిశ్చితార్థ వేడుక‌లో స‌మంత ధ‌రించిన స్పెష‌ల్ డిజైన్డ్ లెహంగా డ్రెస్ చూసి ఊరూ వాడా రోజుల త‌ర‌బ‌డి ముచ్చ‌టించుకుంది. త‌న‌కోస‌మే ఆ డిజైన్‌ని ప్ర‌ముఖ డిజైన‌ర్ క్రేష డిజైన్ చేశారు. ల‌క్ష‌ల్లో వెచ్చించి డిజైన్‌ని రూపొందించారు. అందుకే ఇప్పుడు స‌మంత ధ‌రించిన ఓ బంగారు – వ‌జ్రాల నెక్లెస్ గురించి అంతే స్థాయిలో అచ్చటా ముచ్చ‌టా సాగుతోంది. లేటెస్టుగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెక్లెస్‌ ఫొటో పోస్ట్‌ చేసింది. పెళ్లిలో సమంత ధ‌రించే నెక్లెస్ ఇదే సుమీ అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఫోటోకి లైక్‌లు, కామెంట్లు హోరెత్తిపోతున్నాయ్‌. సామ్‌ పెళ్లి దుస్తులు, ఆభ‌ర‌ణాలు స‌హా ప్ర‌తిదీ బాధ్యతల్ని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ క్రేశాబజాజ్‌కు అప్పగించిన విషయం తెల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat