పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ పై అనేకమైన గాసిప్పులు పుట్టుకొచ్చాయి. పవన్‌తో విడాల కోసం రేణూ భారీగా డబ్బులు తీసుకుందని, ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అంతేకాదు తాను మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నానని ఓ సంచలన విషయం కూడా చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ రేణు పై సోషల్ మీడియాలో రకారకాల కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొందరైతే హద్దులు దాటి మెసేజ్‌లు పెట్టారు. దీంతో రేణూదేశాయ్ కూడా బాగానే కౌంటర్ ఇచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా రేణూ మళ్ళీ పెళ్లి మాట ఎత్తగానే.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఒకవేళ రేణూ పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటుంది అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ చర్చల నడుమ ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. రేణూ మనసులో మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకుంటే తనతో సన్నిహితంగా మెలిగే ఒక దర్శకుడిని పెళ్లి చేసుకోవచ్చని ఒక షాకింగ్ రూమర్ బయటకి వచ్చింది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉన్నా.. పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్ళీ పెళ్లి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.