కాంచన, చంద్రకళ, శివగంగ సినిమాలతో హారర్ చిత్రాలకే పరిమితమైందనుకున్న రాయ్ లక్ష్మీ ఆలియాస్ లక్ష్మీ రాయ్ నటిస్తోన్న తాజా బాలీవుడ్ చిత్రం జూలీ-2. ఈ మూవీలో ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల కాగా ఇందులో రాయ్ అందాలకు ఫిదా కాని వారు లేరు. బోల్డ్ లుక్‌లో రాయ్ లక్ష్మీని చూసిన ఫ్యాన్స్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక ఈ హాట్ బ్యూటీ పర్శనల్ విషయానికి వస్తే.. రాయ్ లక్ష్మీ ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ మోడల్, నటుడు హనీఫ్ హీలాల్ అనే వ్యక్తితో లవ్‌లో పడిపోయిందని, డేట్ పేరుతో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సినీ నటిగా కంటే ధోనీకి మాజీ ప్రేయసిగా అత్యధిక పేరుప్రఖ్యాతులు సంపాదించిన సంగతి తెలిసిందే. ధోనీతో ప్రేమ విఫలమైందని, అది గతించిన కథ అంటూ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. దీనిపై పుకార్లు ఆగకపోవడంతో దీనిపై పుకార్లు ఆగకపోవడంతో ఆమె మరో వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని బిటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న జూలీ-2 సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి రాయ్ లక్ష్మీ బాలీవుడ్లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే.