జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంగళవారం పవన్ నాలుగోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ తన లైఫ్లో మూడు పెళ్లిళ్ళు చేసుకోగా.. మొదటి భార్య నందినీతో సంతానం కల్గకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇక తర్వాత రేణుదేశాయ్తో సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. విడాకులు.. అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత రష్యన్ భామ లెజ్నోవాతో పెళ్లి.. మొదట ఒక అమ్మాయి, ఇప్పుడు అబ్బాయి.. ఇలా పవన్ తన వారసులను పెంచుకుంటూ పోతున్నారు. ఇక పవన్ నాగుగో సంతానం పై పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా మాజీ భార్య రేణూ కూడా స్పందిచారని సమాచారం. పవన్ కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడని, చాలా చక్కగా అందంగా ఉన్నాడని అంటూ పవన్ కి ఆమె ట్వీట్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
