సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. అలాంటి అందమైన ప్రపంచంలో అందాల్ని ఆరబోస్తూ అవకాశాలు కొల్లగొట్టడంలో రాయ్ లక్ష్మీ ని మించిన వారు లేరని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా ఎన్ని పాత్రలు చేసినా, బ్రేక్ రాకపోవడంతో ఐటం సాంగులతో మెరిపించడం మొదలెట్టింది. ఆ సమయంలోనే అనుకోని రీతిలో బాలీవుడ్ సినిమా జూలీ-2లో నటించే అవకాశం రావడంతో , ఎలాగైనా ఈ సినిమాతో పాపులర్ అయిపోవాలని , తనలో ఉన్న టాలెంట్లను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ జూలీ 2 బాగా పాపులర్ అయిపోయింది. ఇటీవలి కాలంలో రిలీజ్ చేసిన పోస్టర్లు, వీడియోలు ఇండియా మొత్తం వైరల్ అయిపోయాయి.ఇక రీసెంట్ గా ఈ సినిమాలో కోయీ హోస్లాతో అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆ పాటలో రాయ్ లక్ష్మి అందాల ఆరబోతని చూస్తే ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టడం ఖాయం. ఇక ఇదే పాటలో సినిమా కాన్సెప్ట్ కూడా రివీల్ చేశారు. బాలీవుడ్‌లో ఉన్న చీకటి కోణం.. అండర్ వరల్డ్ మాఫియా- రాజకీయాలకు మధ్యవున్న సంబంధాల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.