శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద దుమ్ము రేపింది. ఇక ఆ చిత్రంలో తెలంగాణ యాసలో భానుమతిగా మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందట. ఈ వార్తలను సాయిపల్లవిని ఖండించకపోవడంతో… ప్రేమ వ్యవహారం నిజమేనని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, సాయి పల్లవి ప్రేమలో ఉన్న హీరోకి గతంలోనే పెళ్లి కూడా అయిపోయిందట.
ఇకపోతే ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవికి టాలీవుడ్‌లో యమా క్రేజ్ వచ్చింది. ఎవరి నోటా చూసిన అమ్మాయి బాగా చేసింది అని సాయి పల్లవి నటన గురించి గొప్పగా చెప్పుకొన్నారు. ఇక టాలీవుడ్ తెర మీదే కాదు. దక్షిణాదిలో దుమ్ము దులపడం ఖాయమనే అంతా భావించారు. కానీ ఫిదా తర్వాత తెలుగులో గొప్పగా సినిమాలను అంగీకరించిన దాఖలాలు కనిపించడం లేదు. తెలుగులో ప్రస్తుతం నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నానితో సమానంగా పోటీ పడుతూ సాయిపల్లవి అద్భుతంగా నటిస్తోందని.. టాలీవుడ్‌లో సాయికి మరో హిట్ ఖాయమని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.