మాస్ మహారాజు రవితేజ దాదాపు రెండు యేండ్ల తర్వాత రాజా ది గ్రేట్ అంటూ సరికొత్త మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రవితేజ ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .
ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దాదాపు రెండు యేండ్ల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాతో బుధవారం మీ ముందుకు వస్తుంది .దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమా చేశానని, తన కెరీర్లోని మంచి సినిమాల్లో ఇదీ ఒకటని ఆయన చెప్పారు.
నిజానికి అనిల్ మొదటి సినిమా `పటాస్` కథ తనకే చెప్పాడని, ఆ సినిమాలో తానే హీరోగా చేయాల్సిందని ఆయన తెలిపాడు.కానీ కొన్ని రీజన్స్ కారణంగా ఆ సినిమాను వదులుకున్నానని మాస్ మహారాజు చెప్పాడు.