మిస్టర్ వివాదం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ చిత్ర కథ కోసం తాను లక్ష్మీ పార్వతిని కాని, ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులను కాని కలవనని చెబుతున్నారు. కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా. లక్ష్మీ పార్వతిని కూడా గతంలో కలవలేదని ఆయన చెప్పారు.
ఎందుకంటే ఎన్టీఆర్‌గారితో ఎమోషనల్ కాంటాక్ట్ ఉన్నవాళ్లకు వ్యక్తిగతంగానో, రాజకీయంగానో, మరో రకంగానో ఏవో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తారు. అప్పుడు నేను నిజాన్ని తెలుసుకోలేను. రామారావు గారింట్లో పనిచేసిన డ్రైవర్‌ని కలిశా. అలాగే ఒక వంట వ్యక్తిని, పనివాళ్లనూ ఇంకా కొంత మంది వ్యక్తులను కలిసాను. ఎవరికైతే వ్యక్తిగత ప్రయోజనాలు లేవో వాళ్లను కలిశా. మన ఇంట్లో పనిచేసే వాళ్లకు మన గురించి తెలిసినంత మనకు కూడా తెలీదని నేను నమ్ముతా అని వర్మ అన్నారు.