టాలీవుడ్‌కి సోలోగా వచ్చి మాస్ మహరాజ్‌గా ఎదిగిన రవితేజ.. హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే కథానాయకుడు. ఆయన తొలిసారి అంధుడిగా నటిస్తున్నారు. ఇక పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం దీపావళి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
అర్ధరాత్రి నుండే ఓవర్సీస్ లో ఈ చిత్ర ప్రీమియర్స్ షోస్ ప్రదర్శించడం జరగడంతో చిత్ర టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన అభిమానులు తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ నుండి రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన మూవీ కావడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందట.. సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్న రీతిలో లేదని.. బాగా స్లో అయ్యిందని అంటున్నారు.