టాలీవుడ్‌లో ఎక్కువ మంది స్టార్లు ఉన్నా.. ఒంటి చేత్తో సినిమాని నిలబెట్టే నటులు మాత్రం అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి తెలుగు నటుల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక తారక్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కోర్టు లో చేసే నటనగాని టెంపర్ సినిమాలో కోర్టు సీన్ గాని, మొన్న వచ్చిన జై లవ కుశ సినిమాలో త్రిపాత్రాభినయం గాని ఎన్టీఆర్ నటన ఏంటో చెబుతాయి. అలాంటి నటుడితో కలిసి ఏ హీరో అయినా సినిమా చేయటానికి ఇష్టపడతాడు. అయితే ఇప్పుడు మెగా హీరో ఒకరు తారక్ తో కలిసి పనిచేయాలనుందని షాక్ ఇచ్చాడు. మెగా మేనల్లుడుగా మనకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తనదైన శైలిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. సాయి తాజాగా తన పుట్టినరోజు ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.
అయితే పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్ లైవ్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు సాయిధరమ్ తేజ్. అందులో భాగంగా ఒక అభిమాని సాయి ధరం ని ఒక ప్రశ్న అడిగాడు.. మీకు ఏ హీరోతో అయినా పనిచేయాలని ఉందా అని అభిమాని అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ ప్రస్తుత హీరోల్లో ఎన్టీయార్‌ను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోను.. అలాగే మహేష్ బాబు, నానితో కూడా వర్క్ చేయాలనుంది. మంచి స్క్రిప్ట్ దొరికితే కచ్చితంగా ఈ హీరోలతో పని చేస్తా అంటూ సమాధానం ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం బివీస్ రవి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్‌లో.. జవాన్ అనే సినిమా లో బిజీగ వున్నాడు. అంతేకాకుండా మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో మరో మూవీని కూడా పట్టాలెక్కించాడు.