బుల్లి తెరపై బెస్ట్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి, రవిల గురించి అనేక రూమర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు మరో హాట్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మరింది. అసలు విషయం ఏంటంటే.. అనగనగా తెలుగు బుల్లితెర.. అందులో ఒక టచ్చింగ్ ప్రోగ్రాం.. అదేనండి యాంకర్ ప్రదీప్ హొస్ట్ చేసే.. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా.. ప్రతి ఆదివారం మన ప్రదీప్ మాచిరాజు సెలబ్రిటీలతో చెడుగుడు ఆడేసుకునే ప్రోగ్రాంలోకి .. పటాస్ ఫేమ్ రవి, శ్రీముఖి, జబర్ధస్త్ ఫేం రష్మీలు కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా ప్రోగ్రాంలోకి వచ్చారు..
ఇక శ్రీముఖి, రష్మీలు కొంచెం ఓవర్ చేస్తూ పెగ్ సిస్టమ్ అంటూ సగం ఆలింగనం చేసుకుంటారు.. అంతే కాకుండా ప్రదీప్ రవిలను కూడా అలాగే చేయాలని ప్రపోజల్ పెడుతారు.. దీంతో రవి తన పెదాలను రుద్దుకుంటూ ఉంటాడు.. ఇంతలో ప్రదీప్ ఎంటీ పెదాలు రుద్దుకుంటున్నావ్.. రూల్స్ ప్రకారం పెదాలు టచ్ అవ్వవు కదా అని అడుగగా.. వెనుక వచ్చే టప్పుడు శ్రీముఖి ముద్దు పెట్టింది.. అందుకే రుద్దుకుంటున్నానని చెబుతాడు.. దీంతో గాస్సిప్పు రాయుళ్ళను ఉద్దేశించి చెబుతూ.. రాసుకునే వాళ్ళు కొత్తగా రాసుకోనక్కర లేదు.. వీళ్ళే ఇస్తూ ఉంటారు పుటేజ్ అని ప్రదీప్ తనదైన శైలిలో సైటైర్లు వేశాడు.. అయినా టీఆర్పీల కోసం డబుల్ వేషాలు వేసి.. అలా రాశారు.. ఇలా రాశారు అని ఏడవడం ఎందుకని సర్వాత్రా చర్చించుకుంటున్నారు. ఇదండీ శ్రీముఖి- రవిల లిప్ లాక్ స్టోరీ.