బుల్లితెరపై ఒకవైపు ఫైర్‌బ్రాండ్‌గా మరోవైపు హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నయాంకర్ శ్రీముఖి.. రచయిత మరియు కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ ట్రైలర్లో శ్రీముఖి అందాలకు హర్ష వర్ధన్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణంలా నిలిచిందరని.. ఈ సారి తప్పకుండా హిట్టు సినిమాని శ్రీముఖి తన ఖాతాలో వేసుకునేలా ఉందని టాక్ వినిపిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ శివ సినిమాకి ముందు అంటూ స్టార్ట్ అయిన ట్రైలర్, ఉన్న మూడు నిమిషాలు చాలా కొత్తగానూ ఆసక్తికరంగానూ అనిపించింది. ఇక శ్రీముఖి ఇంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. శ్రీముఖికి ఇంత ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఉండటానికికారణం కేవలం అందం మాత్రమే కాదు. ఆకట్టుకునే సెక్స్ అప్పీలు, ఆమె యాటిట్యూడ్ కూడా ఓ కారణమే. ఫేస్ బుక్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 లక్షల పైనే ఉందంట.. మరి బుల్లితెర పై సక్సెస్ సాధించిన శ్రీముఖి.. వెండితెరపై కూడా సక్కెస్ సాధిస్తుందో లేదో చూడాలి.