అక్కినేని నాగ చైతన్య సమంతలు పెళ్లి అయ్యి 15 రోజులు గడుస్తున్నా వారు మాత్రం హానీమూన్ గినిమూన్ అంటూ లేకుండా.. సమంత తన సినిమాల విషయంలో బిజీ కాగా… చైతూ తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. మరి ఈ జంట కూడా ఇప్పుడు మినీ హనీమూన్‌ని ప్లాన్ చేసుకుంటున్నారట. అసలు తమ హనీమూన్‌ని డిసెంబర్‌కు వాయిదా వేసుకున్న ఈ జంట ఇప్పుడు మినీ హనీమూన్ అంటూ న్యూజిలాండ్‌కి ఎగిరిపోనున్నారనే టాక్ సినీ వర్గీయుల్లో వినిపిస్తోంది. సమంత తమ హానీమూన్ ఇప్పుడే కాదని చెబుతున్నప్పటికీ.. ఈ యువ జంట కనీసం ఒక వారం పాటు ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచనతో న్యూజిలాండ్ చెక్కేస్తున్నట్టుగా చెబుతున్నారు.
సమంత ప్రస్తుతం రంగస్థలం, మహానటి సినిమాల కాల్షీట్స్ ని అడ్జెస్ట్ చేసుకుని మరీ ఈ మినీ హానిమూన్‌కి ప్రిపేర్ అవుతుందంటున్నారు. ఇక ఈ మినీ హానిమూన్ పూర్తవగానే నాగ చైతన్య తన కొత్త సినిమా చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచిని స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉండగా.. సమంత కూడా తన సినిమాల షూటింగ్ ని కంప్లీట్ చేస్తుందంటున్నారు. ఇక ఈ మినీ హానిమూన్‌లో ఈ జంట న్యూజిలాండ్ కి వెళ్లొచ్చాక.. అలాగే నాగ్ – అమల ల టూర్ ముగిశాక చైతు – సామ్ ల రిసెప్షన్ ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే చైతన్య – సమం ల ఒక రిసెప్షన్ చైతు తల్లి లక్ష్మి ఆధ్వర్యంలో సింపుల్‌గా జరిగింది.