తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. నిర్మాతల, దర్శకుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలా మంది చెప్పారు. అలా లొంగకపోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిపోతోందని కూడా చెప్పారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి సాగుతున్న.. ఇప్పటికీ కొనసాగుతున్న నీచమైన వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది కాస్టింగ్ కౌచ్.
ఇక హీరోయిన్‌గా అవకాశం కావాలంటే తనతో పడుకోవాలని అడిగే దర్శకులు, తనకు సెక్స్ సుఖం అందించాలని కోరే స్టార్ హీరోలు, నిర్మాతలు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఒప్పుకుంటున్నారు. తమకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అయితే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే సదరు దర్శకులు, నిర్మాతల పేర్లను బయట పెట్టే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు. అయితే అడ్జస్ట్ అవడం, కాకపోవడం అనేదివారి వారి వ్యక్తిగత నిర్ణయాలను బట్టి ఉంటుందని, అయితే అలా అడ్జస్ట్ అయిన వారు మాత్రమే ముందుకు వెళతారని కొంతమంది సీనియర్ భామలు చెప్పడం గమనార్హం. ఇదండీ మన తెలుగు సినీ సిత్రాలు.. పక్కలో సాంప్రదాయాలు.