టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్కమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బయటకురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది.
అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైందని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదని పవన్ అన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలోనూ ప్రచారం సాగుతోంది. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత పవన్ సినిమా గురించి ఓ పిక్ బయటకు వచ్చిందని అనుకుంటున్నా.. పవన్ చేతికి గాయమవడంతో పవన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.