Home / MOVIES / లైంగిక వేదింపులు.. ప్రియాంక చోప్రా సంచ‌ల‌నం..!

లైంగిక వేదింపులు.. ప్రియాంక చోప్రా సంచ‌ల‌నం..!

వివాదాస్పద నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లాంటి వాళ్లు ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అని, అలాంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పేర్కొంది. ఇటీవల హాలీవుడ్‌ను కుదిపేసిన వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ అందరికీ తెలిసిందే. తమపై లైంగిక దాడులు చేశాడంటూ అనేక మంది హాలీవుడ్ హీరోయిన్లు ప్రొడ్యూసర్ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఈ వివాదంపై బాలీవుడ్ భామ ప్రియాంకా కూడా స్పందించింది. మారి క్లారీ పవర్ ట్రిప్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె ఆ వెబ్‌సైట్‌తో మాట్లాడింది.

ఇండియాలో హార్వే వైన్‌స్టీన్ లాంటి వ్యక్తులు ఉన్నారా అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చింది. అలాంటి వ్యక్తులు ఉన్నారని అనుకోను, హాలీవుడ్‌లోనూ వైన్‌స్టీన్ ఒక్కడే ఉన్నాడని చెప్పలేను, ఇక ముందు కూడా ఇలాంటివి అనేక కథనాలు బయటకు వస్తుంటాయ”ని, ఒక్క భారత్‌లోనే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, మహిళా శక్తిని టేకోవర్ చేయాలనుకునే పురుషుల ఆధిపత్యం ఇలాగే ఉంటుందని చోప్రా పేర్కొన్నది. పురుషాధిక్యమే లైంగిక వేధింపులకు కారణం అని అభిప్రాయపడింది.

లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లోనూ కామన్ అని.. సినీ ప్రపంచం అంటే గ్లామరస్‌ ఇండస్ట్రీ. ఇక్కడ ఇంకాస్త ఎక్కువ వుంటాయంతే. నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే. ఓ దశలో తీవ్రమైన లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నాను. నాలా చాలామంది ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఎదుర్కుంతున్నారు. మేల్ డామినేషన్ దీనికి కారణం అని వ్యాఖ్యానించింది ప్రియాంక. అంతేకాదు.. ఇక్కడ పవర్‌, పలుకుబడి ముఖ్యమని.. ఆ పవర్‌ మహిళలకూ దక్కితే లైంగిక వేధింపులు తగ్గుతాయని ఓ సలహా కూడా ఇచ్చింది ప్రియాంక. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రియాంక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat