టాలీవుడ్‌లో డ్యాన్స్ బాగా చేసే హీరోల్లో ముందుగా వినిపించే పేర్లలో ఎన్టీఆర్, బన్నీలు ముందుంటారు. ఇక వీళ్ళ డ్యాన్స్ కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా తెలుగు, తమిళ భాషల్లో డ్యాన్స్ మాస్టర్‌గా మంచి పేరు సంపాదించిన రాజుసుందరానికి ఇదే ప్రశ్న ఎదురు అయ్యింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సినిమాలకి నృత్య దర్శకుడిగా వ్యవహరించిన ఆయన , రెండు భాషల్లోనూ ఎంతోమంది హీరోలతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్ బన్నీల పాటలకు కూడా డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఇద్దరి హీరోల డాన్సుల గురించిన ప్రశ్నించగా.. రాజు సుందరం తన అనుభవాన్ని బట్టి సమాధానమిచ్చారు. ఎన్టీఆర్, బన్నీలు ఇద్దరూ మంచి డాన్సర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఒకసారి ఒక స్టెప్‌ను కంపోజ్ చేస్తే.. ఆ స్టెప్‌ను అల్లు అర్జున్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తాడని అన్నారు. ఇక ఎన్టీఆర్‌కి ప్రాక్టీస్.. రిహార్సల్స్ వంటివి ఏవీ ఉండవనీ.. ఒకసారి కంపోజ్ చేయగానే వెంటనే చేసేస్తాడని అన్నారు. ఎవరి స్టైల్ వాళ్లకి ఉందనీ .. ఇద్దరూ పెర్ఫెక్ట్‌గా చేసే మంచి డ్యాన్సర్లని కితాబిచ్చాడు.