Home / MOVIES / అన‌సూయ హార్ట్ ట‌చ్చింగ్ ఫొటోలో.. అంత మ్యాట‌ర్ ఉందా..?

అన‌సూయ హార్ట్ ట‌చ్చింగ్ ఫొటోలో.. అంత మ్యాట‌ర్ ఉందా..?

తెలుగు బుల్లి తెర హాట్ కామెడీ ప్ర్రోగ్రాంలు జ‌బ‌ర్ధ‌స్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ యాంకర్లు అన‌సూయ, ర‌ష్మీలు మంచి స్నేహితులు. ఇద్ద‌రూ వెండితెర పై కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తున్నారు. ఇక, ఈ ఇద్దరి మధ్యా విభేదాలంటూ అప్పుడప్పుడూ గాసిప్స్‌ వస్తూనే వున్నాయి. వాటిని ఈ ఇద్దరూ ఖండించేస్తున్నారు. అయినా, గాసిప్స్‌ ఆగుతాయా.. అలా అలా షికార్లు చేస్తూనే ఉన్నాయి.

ఇక ప్ర‌తిసారి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ వ‌స్తున్న గాసిప్స్‌కి చెక్ ప‌డుతూ అన‌సూయ పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇద్ద‌రు శక్తిమంతమైన మహిళలు.. ఉన్నత స్థితికి చేరేందుకు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు.. అంతేకాని ఒకరినొకరు అణగదొక్కేందుకు ప్రయత్నించరు అని పేర్కొంది. అయితే అనసూయ మనసులో మాట సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుండ‌గా.. సూయా పోస్ట్ చేసిన పిక్ కూడా కళాత్మకంగానే వుందండోయ్‌. ఇప్ప‌టికైనా అనసూయ – రష్మీల‌ మధ్య వివాదాలంటూ గాసిప్స్‌ ఆగిపోతాయో లేదో చూడాలి.